Friday, August 10, 2012

Pravachanaalu

Home

Photos

Speeches

Songs

Videos

Pravachanaalu

Contact

శ్రీ శ్రీ శ్రీ సద్గురు భం భం బాబా


* భం అంటే ఏమిటి ?


భం లో మూడు పదాలు వున్నాయి. 1. భే 2. హే ౩. మీం
1. భే అంటే భందా 2. మీం అంటే మాలిక్ ౩. హే అంటే హై
3 కలిపితే భందా మాలిక్ హై
భందా అంటే ఆత్మ
మాలిక్ అంటే పరమాత్మ
హై అంటే వున్నాడు

ఆత్మ పరమాత్మ అయి వున్నాడు.




* ఆధ్యాత్మిక క్షేత్రం లో అడుగు పెట్టాలంటే కావలసిన అర్హతలు ఏమిటి ?


సాధనా చతుష్టయ సంపద.
1 . వివేకము
2 . వైరాగ్యం
౩. శ్యమాదులతో కూడిన సంపద
4 . మోక్షం మీద ఆసక్తి



* నీ నిజమైన బందువులు ఎవరు ?



జవాబు) తల్లి, తండ్రి, భార్య, పిల్లలు వీరు నా వాళ్ళు వీరు నా వాళ్ళు అని అనుకుంటారు .
అయితే అనుభవజ్ఞుల మాట ఇది కాదు.
సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భాద్రు దయా సఖా
శాంతి పత్ని క్షమా పుత్రా
శడైతే మమ భాంధవాహ
అంటే
సత్యమే నీ తల్లి, జ్ఞానం నీ తండ్రి
ధర్మమే నీ తోబుట్టువులు, దయనే నీ స్నేహితులు
శాంతీ నీ భార్య, క్షమాగుణమే నీ పిల్లలు
వీరు నీ నిజమైన బందువులు



* జీవితంలో ఏది శాశ్వతం అనే విషయం గురించి బాబా చెప్పిన నగ్న సత్యాలు ?


జవాబు) ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రునిపాలు ,
కటిన శల్యములేల్ల గంగ పాలు ,
మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు ,
కొడుకు వండిన కూడు కాకులా పాలు ,
బ్రష్ట పెల్లమున్న పరుల పాలు ,
ఇల్లు సొమ్ము మంచము ఇతరుల పాలు,
పాపములు ఒనరించిన జీవుడు యముని పాలు ,
ఏది తన వెంట రాదురా ఎరుగుమూడ,
మాయలోకమురా జీవ,
మమకారము వదలుమురా
సారంశము: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు


* మోక్షానికి ఎవరు వెళతారు ?


జవాబు)
1) మోక్షం లో 2 పదాలు వున్నాయి.
మో అంటే మొహం అని అర్థం
క్షం అంటే విడిచిపెట్టడం అని అర్థం
అంటే మొహాన్ని ఎవరయితే విదిచిపెదతారో వారు మోక్షానికి అర్హులు.
2) నేను అన్న నానత్వాన్ని ఎవరయితే విదిచిపెదతారో వారు మోక్షానికి అర్హులు.

2 comments: